Sgx nifty india,sgx nifty today,timings of sgx nifty

















SGX NIFTY INDIA | WHAT IS SGX NIFTY | SGX నిఫ్టీ అంటే ఏమిటి? 


SGX అంటే singapore exchange మనకు national exchange (NSE) ఎలాగో singapore కి ఈ SGX అలాగా. మన నిఫ్టీ 50 index futures ఇక్కడ ట్రేడ్ అవ్వటమే కాకుండా సింగాపుర్‌ లో కూడా ట్రేడ్‌ అవుతుంటాయి ఆ futures నే మనం SGX NIFTY గా పిలుచుకుంటాం...



TIMINGS OF SGX NIFTY:-
Sgx nifty india,timings of sgx nifty



మన indian exchange లో ఉదయం 9:15 కి మార్కెట్లు ఓపెన్‌ అయ్యి 3:30PMకు క్లోజ్‌ అవుతాయి. అంటే సుమారు 6 గంటలు ఓపెన్‌ లో ఉంటాయి. కానీ సింగాపుర్‌ నిఫ్టీ వాళ్ళ టైమింగ్ లో ఉదయం 9 నుండి సాయంత్రం 6:10 వరకు మరియు ఒక 30 నిమిషాల బ్రేక్‌ తరువాత అంటే 6:40PM నుండి 5:15 AM వరకు ఓపెన్‌ లో ఉంటుంది.

ఇక్కడ 9AM నుండి 6:10PM ఉండే పెషన్‌ ను T session అని మరియు మిగతా 6:40PM & 5:15AM ను T session 1 అని పిలుస్తారు.

 


TIMINGS OF SGX NIFTY(INDIA TIMINGS)



 6:30 AM నుండి 3:40 PM ------ T session , 30 నిమిషాల విరామం తర్వాత అంటే...

 4:10 PM నుండి 2:45 AM ------ T session 1 గా చూడొచ్చు.

ఇకడ ఒక విషయం, ఈ టైమింగ్ ని గమనిస్తే దాదాపు ఈ SGX NIFTY అనేది 16 గంటల పాటు ఓపెన్‌ లో ఉంటుంది. అంటే మన మార్కెట్లు క్లోజ్ అయ్యాక కూడా ఓపెన్ లో ఉంటాయి. కాబట్టి మన మార్కెట్లు క్లోజ్ అయ్యాక ఏమైనా న్యూస్‌ వస్తే మనవాళ్లు ఈ SGX NIFTY ని గమనిస్తుంటారు.దానిని బట్టి రేపు మార్కెట్లు ఎలా ఓపెన్‌ అవోచ్చు అని ఒక అంచనాకు వస్తారు. దానికి తగ్గట్టు మన ట్రేడర్స్ వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్ ని ప్రిపేర్ చేస్కుంటారు.



SGX NIFTY లో మనం ట్రేడ్‌ చేయొచ్చా?



లేదు,మనం ఈ  SGX NIFTY లో ట్రేడ్‌ చేయలేం. అయితే ఎవరు ట్రేడ్‌ చేస్తారు అంటే......

singapore citizens మన లాంటి ట్రేడర్స్‌ అక్కడ కూడా ఉంటారు కద... వాళ్ళు ట్రేడ్‌ చేస్తుంటారు 

big players అంటే FIIs. అయితే వాళ్ళు మన నిఫ్టీ లో కొన్ని సార్లు ఓవర్‌ నైట్‌ positons తీసుకుంటారు కాబట్టి. ఏమైనా న్యూస్‌ వస్తే వాళ్ళకి ఇబ్బంది కాకుండా sgx nifty futures లో hedge చేస్తారు.


SGX NIFTY ని ఎలా చెక్‌ చేయాలి?


అయితే ఈ SGX నిఫ్టీ ని మన బ్రోకర్స్‌ తమ ఆప్ లో చూసుకునే అవకాశం దాదాపు యే బ్రోకర్‌ కల్పించడం లేదు. కానీ మనం investing.com, money control, sgx nifty.com, tradingview లాంటి వెబ్సైట్‌ లలో చూడొచ్చు.


ఒక చిన్న డెమో:-


గుగుల్ ప్లే స్టోర్ నుండి tradingview app ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క email తో అక్కౌంట్ క్రియేట్ చేస్కొండి.



STEP-1 తరువాత టాప్ రైట్ కార్నర్ లో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది.



Sgx nifty india,sgx nifty today,timings of sgx nifty





STEP-2 :- అది క్ల్లిక్క్ చేసి SGX NIFTY అని టైప్ చేస్తే కింద చూపించిన విదంగా వస్తుంది. ఆ సింబల్ ని క్లిక్ చేస్తే  SGX NIFTY చార్ట్ ఓపెన్ అవుద్ది. 
Sgx nifty india,sgx nifty today,timings of sgx nifty
STPE-3:- ఇలా చార్ట్ ఓపెన్ అవుద్ది.

Sgx nifty india,sgx nifty today,timings of sgx nifty
  

 ok. ఏ ఆర్టికల్ లో మనం SGXNIFTY గురించి,  timings of sgx nifty(india) మరియు మనకు ఎలా ఉపయోగ పడుతుంది అనే విషయాలను తెలుసుకున్నాం. ఇక్కడి వరకు వచ్చి చదివినందుకు దాన్యవాదాలు.